Saturday, May 12, 2012

ఆమనీ పాడవే హాయిగా (చిత్రం:గీతాంజలి)

ఆమనీ పాడవే హాయిగా (చిత్రం:గీతాంజలి)
ఆమనీ పాడవే హాయిగా ....
మూగవైపోకు ఈవేళ ......
రాలేటి పూల రాగాలతో ....
పూసేటి పూల గంధాలతో...
మంచు తాకి కోయిల మౌనమైన వేళ............ఆమనీ పాడవే.........

వయస్సులో వసంతమే ,ఉషస్సులో జ్వలించగా......
మనస్సులో నిరాశలే రచించెలే ,మరీచికా ....
పదాల రాయగా ..స్వరాల సంపదా..
 తరాల నా కధ క్షణాలదే కదా......
గతించి పోవు గాధ నేనని..............................ఆమనీ పాడవే....

శుకాలతో  ,పికాలతో ధ్వనించిన మహోదయం ......
దివి,భువి కలా నిజం స్ఫురించిన మహోదయం .....
మరో ప్రపంచమే మరింత చేరువై ,నివాళి కోరిన ఉగాది వేళలో 
గతించి పోని గాధ నేనని ..............................ఆమనీ పాడవే ......

 సినిమా పాటల్లో వైవిధ్యానికీ ,ఉత్తమ ప్రమాణాలకీ మారు పేరు వేటూరి .ఇళయ రాజా విషాదం ధ్వనించేలా `భాగేశ్రీ 'రాగంలో సమకూర్చి ఇచ్చిన ఒక బాణీ కి వేటూరి రచించన పాట ఇది.చిత్రంలో ఒక విషాద సన్నివేశంలో నిరాశకి గురైన ఒక  హీరో పాడాల్సిన పాట . సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని   మెలోడీ కి పెద్ద  పీట వేసి ఇళయరాజా శృంగార రస ప్రధాన మైన  `భాగేశ్రీ' రాగాన్ని విషాదాన్ని ప్రతిబింబించేలా ప్రయోగాత్మకంగా సమకూర్చిన ఒక విలక్షణమైన   బాణీ,వేటూరి సాహిత్య పటిమ  ఈ పాట ని నిజంగా నే   `గతించి పోకుండా' చేసాయి.
                    
వినుకొండ మురళి
విశాఖపట్నం