Saturday, May 12, 2012

ఆమనీ పాడవే హాయిగా (చిత్రం:గీతాంజలి)

ఆమనీ పాడవే హాయిగా (చిత్రం:గీతాంజలి)
ఆమనీ పాడవే హాయిగా ....
మూగవైపోకు ఈవేళ ......
రాలేటి పూల రాగాలతో ....
పూసేటి పూల గంధాలతో...
మంచు తాకి కోయిల మౌనమైన వేళ............ఆమనీ పాడవే.........

వయస్సులో వసంతమే ,ఉషస్సులో జ్వలించగా......
మనస్సులో నిరాశలే రచించెలే ,మరీచికా ....
పదాల రాయగా ..స్వరాల సంపదా..
 తరాల నా కధ క్షణాలదే కదా......
గతించి పోవు గాధ నేనని..............................ఆమనీ పాడవే....

శుకాలతో  ,పికాలతో ధ్వనించిన మహోదయం ......
దివి,భువి కలా నిజం స్ఫురించిన మహోదయం .....
మరో ప్రపంచమే మరింత చేరువై ,నివాళి కోరిన ఉగాది వేళలో 
గతించి పోని గాధ నేనని ..............................ఆమనీ పాడవే ......

 సినిమా పాటల్లో వైవిధ్యానికీ ,ఉత్తమ ప్రమాణాలకీ మారు పేరు వేటూరి .ఇళయ రాజా విషాదం ధ్వనించేలా `భాగేశ్రీ 'రాగంలో సమకూర్చి ఇచ్చిన ఒక బాణీ కి వేటూరి రచించన పాట ఇది.చిత్రంలో ఒక విషాద సన్నివేశంలో నిరాశకి గురైన ఒక  హీరో పాడాల్సిన పాట . సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకుని   మెలోడీ కి పెద్ద  పీట వేసి ఇళయరాజా శృంగార రస ప్రధాన మైన  `భాగేశ్రీ' రాగాన్ని విషాదాన్ని ప్రతిబింబించేలా ప్రయోగాత్మకంగా సమకూర్చిన ఒక విలక్షణమైన   బాణీ,వేటూరి సాహిత్య పటిమ  ఈ పాట ని నిజంగా నే   `గతించి పోకుండా' చేసాయి.
                    
వినుకొండ మురళి
విశాఖపట్నం

Wednesday, December 21, 2011

rasasiddhi





 సుందర సుర నందన  వనమల్లి  జాబిల్లి!
అందేనా? ఈ చేతులకందేనా?
చందమామ ఈ కనులకు విన్దేనా?అంతలోనే ఆకాశపు అంచుల viharinche

ఆ మడుగున కనిపించి,నా మనసున నివసించి;
అంతలోనే ఆకాశపు అంచుల విహరించే
చందమామ ఈ కనులకు విన్దేనా?

తలపు దాటనీక మనసు తలుపు వేయగలను కాని ,
నింగి పైకి ఆశ లనే నిచ్చెన వేయగలను  గాని      
కొలనులోన కోర్కేలనే  అలలపైన  ఊగే కలువ
పేద బ్రతుకులోన వలపు తేనే నింపేనా?
  


  బి.ఎన్.రెడ్డి,దేవులపల్లి సాలూరు రాజేశ్వరరావు -వీరు ముగ్గురి combination   లో   మల్లీశ్వరి   మొదలు ఎంత మధురమైన,ఉదాతమైన సిని సంగీతం ఉద్భవించిందో ఎవరూ విడమరచి     వేరే చెప్పనక్కరలేదు.దానికి తోడుగా సావిత్రి నటన! రససిద్ధికి ఇక హద్దులు ఉంటాయా?
       ఈ పాత రచనంతా కృష్ణ శాస్త్రి గారి పులరాధం లాంటి ఉహ.చేరువలో వుంది చేతికందని అదృష్టం.
కళ్ళని అలరించే సురనదనవన మల్లిక లాంటి  జాబిల్లి అందం .మనసు అట్టడుగు పొరల్లోంచి మెల్లగా ప్రవహిన్చుకొచ్చే మృదు భావం.పుట్టుకతో తెచ్చ్చుకున్న సంస్కారానికి ,అబిజ్ఞాతకు,గట్టు దాటని మనోనిబ్బరతకీ ప్రతీక అయిన పాత్రలో ఆ స్త్రీ  మూర్తి ఇన్ని ప్రేమ పుష్పాలతో  కవితలల్లుతుంది.

ఒక ఆరాధకురాలు నిలువెల్లా ప్రేమరాసిగా తనను తానూ మార్చుకుని ఉహా చిత్రానికి వాస్తవజీవితానికీ  మధ్యన గల దూరాన్ని కోలుచుకుని వ్యాకులపడే ఆ పాత్రకి ఈ పాటలోని రెండవ సగం లోని పదాలు సరిగ్గా అతికాయి.మర్యాదా సరిహద్దులు దాటని ఆ ప్రేమ మూర్తికి శాస్త్రి గారు అమర్చిన పాత్రోచిత పద సౌజన్యం అది.
`కలువ పేద బ్రతుకులో వలపు తేనే నింపేనా?'అన్న ఆశ్వాసన.కళ్ళు మూసి వింటే చందమామకి,కళ్ళు తెరచి వింటే ``అండ''మామకి చేరుతూ అది పూజాఫలంగా భాసిల్లింది.
ఈ పాటని సాలూరు వారు ఔచిత్యాన్ని పాటిస్తూ సృజించిన స్వరం ,సుశీల గానం ఈ పాటని చిరస్మరణీయం చేసాయ

Saturday, December 17, 2011

neevuleka veena a beautiful melody in Rag Misra khamaj


సాలూరు రాజేశ్వర రావు గారు అన్నపూర్ణ బ్యానర్ లో దుక్కిపాటి మధుసూదన రావు తీసిన చిత్రాలలో సంగీతం సమకూర్చడంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచేవారు.అందుకు కారణం మధుసూదనరావు గారు మంచి అభిరుచి వున్నా నిర్మాత అంతేకాకుండా  మంచి కధాంశం ,మంచి అభిరుచి గల దర్శకుడు,నటులతో ఆయన చిత్ర్లని నిర్మించే వారు.
ఆయన నిర్మించిన చిత్రాలలో సంగీత పరంగా అత్యన్తజనాదరనపొండిన చిత్రం డా.చక్రవర్తి.ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.అందులో ఈ రొమాంటిక్ సోలో ఒకటి.సంగీతం సాహిత్యం ,గానం ఒకదానిని ఒకటి mecchukuntuu ఈపాటని immortal చేసాయి.

Saturday, November 26, 2011

purgation of emotions

దేవులపల్లి విషాద ప్రసాదం ఎన్నటికి stale కాని ఒకానొక అద్భుత పదార్ధం అన్నాడొక కవి.
అదే ప్రేయసి ప్రియుల ఎడబాటు ద్వారా లభించే దైతే దానికి తిరుగులేనే లేదు..

`` నాకొరకు చెమ్మగిల్లు నయనమ్ము లేదు'' అని వాపోయినా

``మూగవోయిన నా గలమ్మున గూడా నిడురబోఎది సెలయేటి రోడ్లు గలవు''అని postive గా statement ఇచ్చినా అది దేవులపల్లి కే చెల్లింది.
``రానిక నీకోసం చెలి !రాదిక వసంత మాసం'' అంటూ ఈపాటలో నాయకుడు తనకు నాయకి పై గల ప్రేమని ఆమెను చేరాలన్న తపనతో కాక
నిన్ను ఎడబాసి వెళ్ళగలను అన్న త్యాగ బుద్ధి వ్యక్తపరచడం ఆమె పై ``మాయని మమత'' ని పైకి కానరాకుండా వాదిపోయేది హృదయసుమమోకటే అన్న statement ద్వారా వ్యక్తం చెయ్యడం చాలా అపురూపం .

పైకి కానరాకుండా వాదిపోయేది ,
లోకాన హృదయసుమమోకటే!
పెదవి పై నవ్వుపున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే
రానిక నీకోసం సఖీ -రాదిక వసంత మాసం!!
రాలిన సుమాలని ఏరుకొని ,జాలిగా గుండెలో దాచుకుని....!

వాకిలిలో నిలబడకు ! ఇంక నాకై మరి మరి చూడకు !
ప్రతి గాలి సడికి తడబడకు ! పద ధ్వనులని పొరబడకు!
కోయిల పోయెలే ,గూడు గుబులై పోయెలే !...

పగలంతా నా మదిలో మమతలు సెగలై లో లో రగులునులే !
నిద్ర రాని నిసినైనా నాకీ వేదన తప్పదులే!
పోనీలే ... ఇంతేలే... గూడు గుబులై పోయెలే ....
అశ్వద్ధామ పాటకి అసలు రూపం ఇస్తే ఘంటసాలదానికి విశ్వరూపం ఇచ్చారు
ఈ రోజు ఆ మహానుభావులెవరూ మన మధ్య లేకపోయినా మనలని ఆ బాధలో పునీతం చేసి aristotle చెప్పిన ``
``purgation అఫ్ emotions'' కి తీసుకు వెళ్లారు.
ఇక్కడ ప్రత్యేకగా చెప్పుకోవలసిదేవిటంటే ప్రతి వ్యక్తికీ ,తన మసులో భావాలు ఎదుటి వ్యక్తికీ (అది ప్రేయసికి ప్రియు దు కావొచ్చు or vice versa లేదా ఇంకే వ్యక్తీ అయినా కావొచ్చు మన పాట సినిమా పాటలు చాలా బాగా ఉపయోగ పడతాయి.

ఒక మరపురాని paata








కన్నె వయసు లో విడివిడని పువ్వులాంటి ఒక అమ్మాయి సొబగులు అద్భుతంగా వర్ణించిన ఈ పాట కవితా హృదయం గల ఒక అమలిన,రుజు మార్గ  యువకుడు అందమైన అమ్మాయిని చూడగానే కలిగిన హృదయ స్పందన .ఈ పాటలో ఉన్న వెలుగులు,అందాలు,లేత సిగ్గులు,కాలి అందియ ఘలఘలలు మెరుపు తీగెలు,అన్నీ కలిపి పదముపదము lo మధువులురిన కావ్య కన్య ఈ పాట.ఈ పాటలో ఒకానొక విషాదపు  ఛాయ కూడా స్ఫురిస్తుంది.అందమైన ఆ అమ్మాయి ని వర్నిస్తున్నప్పుడు  కీర్తిస్తున్నప్పుడు ఈ అందమంతా లభ్యం కాకపొతే ,అనుభవనీయం కాకపొతే తన జీవితం ఎంత విషాదభరితం అవుతుందో అన్న స్పృహ కుడా గోచరిస్తుంది.
ఈ సినిమా కధలో కన్నెపిల్లలు తగుమాత్రం జాగ్రత్త వహించకపోతే మోసపోతారు సుమీ అనే వార్నింగ్ తో కూడిన సందేశం వుంది.దాశరధి కన్నె వయసు అందాలని ఎంత అందంగా వర్ణించారో,అంత అందంగా సత్యం స్వరం కూర్చడం బాలు ,జానకి ఇద్దరు ఈ పాత పాడినా బాలు .కంటే జానకి ఈ పాటకి న్యాయం చేకూర్చడం ప్రత్యేకంగాచెప్పుకోవాలి .
సత్యం స్వరపరచిన వేళ్ళమీద లేక్కపెత్తగలిగే అతి కొద్ది పాటలలో ఇదొకటి. ఈ పాటని  మిశ్ర కాపి రాగం లో స్వరపరచారుఈ  పాటకి ఓ.పి.నయ్యర్ కష్మిర్కి కలి చిత్రం కోసం ఆశ చేత పాడించిన `aankhonse joutrii hai dil, me ' అనే paata స్ఫూర్తి .ఆ పాట ఇదిగో.



YouTube - Videos from this email

confusion lenii fusion


అందేను నేడే అందని జాబిల్లి
ఆత్మగౌరవం లో రాజేశ్వర రావు గారు స్వరపరచిన ఈ పాట లో సాహిత్యం,సంగీతం,సన్నివేసం ఒకదానిని ఒకటి మెచ్చుకుంటూ చిరస్మరణీయం చేసాయి.

అందేను నేడే అందని జాబిల్లి!
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే!

నా చెక్కిలి మెల్లగా మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి!
గిలిగింతల నామేను పులకించెలే !
నెలరాజే నాతో సరసములాడెనులే !

ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు !
నిదురించిన ఆశలు చిగురించెలే!
చెలికాడే నాలో తలపులు రేపెనులే!

ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు !
విను వీధిని నామది విహరిన్చేలే!
వలరాజే నాలో వలపులు రేపెనులే!

పూజాఫలం సినిమా లో నాయిక
``అందేనా? నీ చేతులకందేనా ?
చందమామ నీకనులకు విన్దేనా?
అంటూ వాపోతే ఈ చిత్రంలో ఆతరువాత తన అదృష్టం ఫలించి
అందేను నేడే అందేను జాబిల్లి అని సంతోషం తో  పాడుకుంటుంది..
చిత్రంలో నాయకుడు నాయకి బావా మరదళ్ళు .చిన్నప్పుడే వాళ్ళఇద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేద్దామని పెద్దలు నిశ్చయించడం తో వాళ్ళిద్దరి మధ్యా అనురాగంఏర్పడుతుంది.విధివశాత్తు ఇద్దరు విడిపోయినా
సినిమా కనుక వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోడం బావా మరదళ్ళు  అని తెలియకుండానే ప్రేమిన్చుకోడం ``

`అలనాటి కలలే ఫలియించె నేడు
మనసైనవాడే !మనసిచ్చే నేడు '!

`ఏ పూర్వబంధం అనుబంధమాయే
అపురూపమైన అనురాగామాయే'!

అని duet పాడుకోడం ,ఆస్తిపరుడైన ఆ జాబిల్లి తనకి అన్డుతాడో లేదో అని వాపోతున్న నాయకి అనుమానం తీరి ఆనందంతో ఈ పాట పాడుకోడం అదీ సన్నివేసం.దాశరధి రాసిన ఈ పాట వింటే చాలు సగం కధ అర్ధమైపోతుంది
.రాజేశ్వర రావు గారు ఆ రోజుల్లోనే వెస్ట్రన్ మిళితం చేసి  `C 'minor scale (మన హరి కాంభోజి రాగం )  లో ఈ పాటని చాలా అందంగా  మలచారు. ఇన్నేళ్ళకు విరిసేను మల్లియలు,ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు అన్న చరణం లో    accidental chords వేస్తూ లో చక్కని సంగీత ప్రయోగం చేసారు)
ఈ సినిమా 1964 వచ్చింది.ఆ రోజుల్లోనే ఈపాటలో ఆయన fusion music అంటే ఏమిటో చూపించారు.ఈ పాటలో sitar,,guitar,sax piano,sax instruments ని వాడుతూ ఆయన చేసిన orchestaration  ఈ నాటికీ ఏ నాటికీ వరల్డ్ క్లాసు సంగీత దర్సకులమని చెప్పుకుని కాలరు ఎగరేసేవారికి వారికి అందని ఎత్తు.
ఇక రాలవు కన్నులముత్యములు
ఇక రాలవు తోటల కుసుమములు
చక్కని పదబంధం
-మురళి