అందేను నేడే అందని జాబిల్లి
ఆత్మగౌరవం లో రాజేశ్వర రావు గారు స్వరపరచిన ఈ పాట లో సాహిత్యం,సంగీతం,సన్నివేసం ఒకదానిని ఒకటి మెచ్చుకుంటూ చిరస్మరణీయం చేసాయి.
అందేను నేడే అందని జాబిల్లి!
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే!
నా చెక్కిలి మెల్లగా మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి!
గిలిగింతల నామేను పులకించెలే !
నెలరాజే నాతో సరసములాడెనులే !
ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు !
నిదురించిన ఆశలు చిగురించెలే!
చెలికాడే నాలో తలపులు రేపెనులే!
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు !
విను వీధిని నామది విహరిన్చేలే!
వలరాజే నాలో వలపులు రేపెనులే!
పూజాఫలం సినిమా లో నాయిక
``అందేనా? నీ చేతులకందేనా ?
చందమామ నీకనులకు విన్దేనా?
అంటూ వాపోతే ఈ చిత్రంలో ఆతరువాత తన అదృష్టం ఫలించి
అందేను నేడే అందేను జాబిల్లి అని సంతోషం తో పాడుకుంటుంది..
చిత్రంలో నాయకుడు నాయకి బావా మరదళ్ళు .చిన్నప్పుడే వాళ్ళఇద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేద్దామని పెద్దలు నిశ్చయించడం తో వాళ్ళిద్దరి మధ్యా అనురాగంఏర్పడుతుంది.విధివశాత్తు ఇద్దరు విడిపోయినా
సినిమా కనుక వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోడం బావా మరదళ్ళు అని తెలియకుండానే ప్రేమిన్చుకోడం ``
`అలనాటి కలలే ఫలియించె నేడు
మనసైనవాడే !మనసిచ్చే నేడు '!
`ఏ పూర్వబంధం అనుబంధమాయే
అపురూపమైన అనురాగామాయే'!
అని duet పాడుకోడం ,ఆస్తిపరుడైన ఆ జాబిల్లి తనకి అన్డుతాడో లేదో అని వాపోతున్న నాయకి అనుమానం తీరి ఆనందంతో ఈ పాట పాడుకోడం అదీ సన్నివేసం.దాశరధి రాసిన ఈ పాట వింటే చాలు సగం కధ అర్ధమైపోతుంది
.రాజేశ్వర రావు గారు ఆ రోజుల్లోనే వెస్ట్రన్ మిళితం చేసి `C 'minor scale (మన హరి కాంభోజి రాగం ) లో ఈ పాటని చాలా అందంగా మలచారు. ఇన్నేళ్ళకు విరిసేను మల్లియలు,ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు అన్న చరణం లో accidental chords వేస్తూ లో చక్కని సంగీత ప్రయోగం చేసారు)
ఈ సినిమా 1964 వచ్చింది.ఆ రోజుల్లోనే ఈపాటలో ఆయన fusion music అంటే ఏమిటో చూపించారు.ఈ పాటలో sitar,,guitar,sax piano,sax instruments ని వాడుతూ ఆయన చేసిన orchestaration ఈ నాటికీ ఏ నాటికీ వరల్డ్ క్లాసు సంగీత దర్సకులమని చెప్పుకుని కాలరు ఎగరేసేవారికి వారికి అందని ఎత్తు.ఇక రాలవు కన్నులముత్యములు
ఇక రాలవు తోటల కుసుమములు
చక్కని పదబంధం
-మురళి
No comments:
Post a Comment