Saturday, November 26, 2011

ఒక మంచి jaavali

చిత్రం : పరమానడయ్య శిష్యులు ,రచన; సముద్రాల ,సంగీతం: ఘంటసాల,గానం; పి.లీల

కామినీ మదన రారా !
నీ కరుణ కోరి పిలచేర !

నాటి తొలిప్రేమ మురిపాల తేల
నాడు జత చేరి లాలించు వేళ
నేర్పిన నీ సరాగాలన్నీ
నీటి పైన రాతలేనా?

మోము కనకున్న మనలేను స్వామి
ప్రేమ విడనాడి పెడమోము లేమి ?
ఏమైనా ,జగం లేకున్నా
నీకై జీవించు దాన !

తెలుగులో వచ్చిన అసంఖ్యాకమైన జావళీ లలో దీనిని రచన, స్వర రచన పరంగా ప్రత్యేకంగా పేర్కొనవచ్చు ..
మాములుగా జావళి అంటే ఒక శృంగార గీతం.కాని ఈ చిత్రంలో సన్నివేశానికి అనుగుణంగా రచించిన జావళి ఇది.
కదా పరంగా అనగనగా ఒక రాజు.(ఆ రాజు అవివాహితుడే! కాని బ్రహ్మచారి మాత్రం కాదు.) అతనికి ఒక వేశ్య పరిచయం అవుతుంది.అందరు వేస్యలలా కాకుండా నిజంగానే అతనిని మనసార ప్రేమించేసి తనువూ,మనసు అర్పించేస్తుంది.ఆతరువాత కధ మామూలే.!.అతను ఆమె సర్వస్వం దోచుకుని కనిపించడం మానేస్తాడు.పాపం ఆ వేశ్య కాని వేశ్య అతని కోసం తపించి పోతూ `` ఆ రోజుల్లో నా ప్రేమ మురిపాలని పొందడానికి ప్రేమ నటించి నా మొహం చూడకుండా నీ దినం velladannaave -అదంతా ఉత్తుత్తి మాటలేనా ,నీటిమీద రాతలేనా? అని కాపి రాగంలో వాపోతుంది..
ఈ జావళి విన్నాక శ్రీదేవి గారి `చడువుకున్న్జ అమ్మయిలు''సినిమా కధ గుర్తువస్తుంది.ఆమె ఎప్పుడో ఒక అర్ధ శతాబ్దం క్రితమే చదువుకున్న అమ్మాయిల మానసిక స్తితి ని చక్కగా వివరించారు.అందమైన అబ్బాయి కనిపిస్తే అబ్బా ఇతను ఎంత handsome గా romantic గా సినిమా లో హీరో లా ఉన్నాడు కదూ ! అని స్నేహితులతో కనిపించిన మొగ పిల్లలని వర్ణించడం,కామెంట్ చెయ్యడం లాంటి సన్నివేశాలు ఆమె అప్పటిలోనే ఉహించి రాసారు..రాబోయే తరాలలో యువతీ యువకులు ఎలాంటి ఆదర్శాలకు ప్రతీకలుగా నిలవాలో శ్రీదేవి గారూ ఆ చిత్రకధ లో చెప్పారు.
ఏదీ మంచో ఏదీ చెడో తెలుసుకోలేని వయసులో ప్రేమలో పడడము ,సర్వం అర్పించడం ఆతరువాత నిజం తెలుసుకున్నాక వాపోడం,లేటుగా కనువిప్పు కలగడం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వున్ది..
అబ్బాయిలు తప్పు చేస్తే పరవాలేదుకాని, మేము చేస్తే తప్పా ?అని కొందరు అమ్మాయిలు ప్రస్నిచడం నేను విన్నాను కాని duradrustavasaattu
మనది పురుషాధిక్య సమాజం .అందుకే ఒక కవి
ఎవరిదీ నేరమని ఎంచి చూడదు
ఏదో పొరపాటని నిన్ను manninchadu
అరిటాకు వంటిది ఆడదాని జీవితం
ముల్లువచ్చి వాలినా ,తాను కాలు జారినా
ముప్పు తనకి తప్పదు ,ముందు బ్రతుకే ఉండదు
అని చాలా కవితాత్మకంగా నిజాన్ని చెప్పాడు.
ఈ వ్యవస్థ మారితే గాని అటువంటి స్త్రీ కి రక్షణ, ,బ్రతుకు వుండదు.నిజమే!
we must accept the truth.
కానీ ,మనం అందరం ఈ వ్యవస్థ మారాలనీ,పురుషుడు చేసే నేరాలకి వొక్క స్త్రీ వే బాధ్యురాలు కాకూడదని ,పరమానడ శిష్యులు సినిమాలో లాగ రాజు మోసం చేస్తే అతనిని శిక్షించాలని కోరుకుందాం!

No comments:

Post a Comment